: ‘డొక్కా’ సైకిలెక్కేశారు... చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి


కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హస్తం పార్టీకి చేయిచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బడా నేతలంతా తమ దారి తాము చూసుకోగా, డొక్కా మాత్రం కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. తన గురువు రాయపాటి సాంబశివరావు సూచన మేరకు ఆయన టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును విజయవాడలో కలిసిన డొక్కా టీడీపీలో చేరిపోయారు. డొక్కాకు పచ్చ కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News