: ఆప్ నుంచి ఇద్దరు ఎంపీల సస్పెన్షన్


ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేసింది. పంజాబ్ కు చెందిన ఎంపీలు ధరమ్ వీర్ గాంధీ, హరీందర్ సింగ్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ వీరిని బహిష్కరించింది. వీరు పంజాబ్ లోని వేదికలపై కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నందున క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. కాగా, గతంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాకేష్ సిన్హాను కూడా సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News