: రెండు రోజుల్లో ఏపీ తన ఉత్వర్వులను వెనక్కి తీసుకోవాలి!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక


ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో మార్పులను సూచిస్తూ జారీ అయిన జీవోపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ జారీ చేసిన సర్క్యులర్ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోని పక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర అవసరం లేదని అనడం సరికాదని ఆయన సూచించారు. తొలగించిన పాఠ్యాంశాలన్నీ ఏపీ సిలబస్ లో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News