: చెవిలో ఏకంగా 26 బొద్దింకలు ఉన్నాయ్!
బొద్దింకలను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది మెల్ బోర్న్ కు చెందిన లీ (19) అనే యువకుడి చెవిలో ఏకంగా 26 బొద్దింకలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రాత్రిపూట చెవిలో ఉన్నట్టుండి నొప్పి వస్తుండటంతో లీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. చెవి విపరీతంగా నొప్పిస్తోందని... వేలితో తడిమితే ఏదో ఉన్నట్టు తెలుస్తోందని చెప్పాడు. దీంతో, చెవిని పరీక్షించిన డాక్టర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. లీ చెవిలో బొద్దింకలు ఉన్నట్టు ఆయన గుర్తించాడు. ఓ బొద్దింక లీ చెవిలో గుడ్లు పెట్టిందని... ఆ గుడ్ల నుంచి పలు బొద్దింకలు పుట్టాయని తెలిపాడు. దీనివల్ల చెవి లోపల భాగం బాగా కందిపోయిందని... మరి కొన్ని రోజులు ఆలస్యం చేసినట్టయితే చెవి పూర్తిగా దెబ్బతిని ఉండేదని చెప్పాడు.