: ప్రియుడు జంప్...భర్త వద్దంటున్నాడు!
ప్రేమ మైకం నిండు జీవితాల్ని బలి తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామానికి చెందిన యువతి (20) ఇంటర్ వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన రాఘవేందర్, ఆ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత మే 13న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరిగింది. అనంతరం, ఆగస్టు 13న ఆమె భర్తను బెదిరించి సదరు యువతిని రాఘవేందర్ తీసుకెళ్లాడు. విజయవాడలో ఆమెతో ఒక రోజు గడిపి తిరిగి నల్గొండ జిల్లా కోదాడ వద్ద ఇంటికి పంపి, ఆటోలో ఎటో వెళ్లిపోయాడు. సదరు యువతి భర్త దగ్గరకు వచ్చింది. దీంతో, భర్త ఆమెతో కాపురం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో పుట్టింటికి చేరిన ఆ యువతి, నిన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి, అతనితో వివాహం చేయాలని డిమాండ్ చేసింది. అది చూసిన ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.