: సల్మాన్ తో నటించే అవకాశం సరైన సమయంలో వస్తుంది: ఎల్లీ అవ్రమ్
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం సరైన సమయంలో వస్తుందని ఎల్లీ అవ్రమ్ తెలిపింది. 'బిగ్ బాస్ సీజన్ 8' ద్వారా బాలీవుడ్ జనాలకు పరిచయమైన ఎల్లీ అవ్రమ్, ఆ షోకు హోస్ట్ చేసిన సల్మాన్ ను విపరీతంగా ఆకట్టుకుంది. విదేశీ వనిత అయినప్పటికీ అసలు సిసలైన భారతీయ యువతిలా ఎల్లీ కనిపిస్తోందని సల్మాన్ పలు సందర్భాల్లో కితాబిచ్చాడు. దీంతో షో పూర్తయ్యాక ఎల్లీకి సల్మాన్ నటించే అవకాశం ఇస్తాడని, పెళ్లి కూడా చేసుకుంటాడని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఎల్లీ 'వైరస్' సినిమా ద్వారా వెండితెరకు కూడా పరిచయమైంది. సల్లూబాయ్ పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఎల్లీ ఏ సందర్భంలో ఎదురైనా సల్మాన్ చూపించే ఆప్యాయతలో ఏమాత్రం మార్పురాకపోవడం విశేషం. 'లాక్మే' ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సందర్భంగా సల్మాన్ తో సినిమా ఎప్పుడు? అన్న ప్రశ్నకు ఎల్లీ సమాధానమిస్తూ, సల్మాన్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, సరైన సమయంలో అవకాశం వస్తుందని చెప్పింది.