: వన్డేలకు గుడ్ బై చెప్పిన బెల్


ప్రముఖ ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ ఇయాన్ బెల్ అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టెస్టులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెల్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ గెలిచిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడంటూ ఇయాన్ బెల్ గురించి ఇంగ్లండ్ మీడియా ఇటీవల కథనాలు ప్రచురించింది. అయితే వన్డేల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్టు బెల్ ప్రకటించడం విశేషం. యాషెస్ ముగిసిన అనంతరం కోచ్ ట్రెవర్ బెలిస్, కెప్టెన్ అలిస్టర్ కుక్ తో చర్చించిన అనంతరం తానీ నిర్ణయం తీసుకున్నట్టు బెల్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునేందుకు ఇది సరైన సమయం అని భావించడం లేదని, అందుకే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించలేదని వెల్లడించాడు. కాగా, ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఇయాన్ బెల్ 161 వన్డేలాడి 5,416 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News