: తెలంగాణ కరాటే క్రీడాకారిణికి ప్రభుత్వ సాయం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరాటే క్రీడాకారిణి సైదాఫలక్ ను ప్రభుత్వం ఆదుకుంది. ఆమెకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించింది. త్వరలో జపాన్ లో జరిగే కరాటే ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు ఆమెకు రూ.3 లక్షలు అందించింది. ఈ సందర్భంగా సైదా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. గత నెలలో చెన్నై ఓపెన్ లో సైదా స్వర్ణ పతకం సాధించింది.