: చెన్నై మెట్రో రైలులో తొలిసారి సినిమా షూటింగ్


రెండు నెలల కిందట ప్రారంభమైన చెన్నై మెట్రో రైలులో షూటింగ్ చేసేందుకు తమిళ దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. మొదటిసారి సినీ నటుడు ప్రశాంత్ చిత్రం మెట్రో రైలులో షూటింగ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన 'సాహసం' అనే సినిమాలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని మెట్రో రైలులో షూట్ చేయబోతున్నారు. ఈ విషయమై ప్రశాంత్ తండ్రి, దర్శకనిర్మాత త్యాగరాజన్ మాట్లాడుతూ, 'సాహసం' షూటింగును జరిపేందుకు మెట్రోరైలు అధికారులు అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అక్కడ ఫైట్ సీన్ ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ నెల 31న షూటింగ్ జరుగుతుందని తెలిపారు. కాగా, ఒక్క రోజు మెట్రోరైలులో షూటింగ్ కు రూ.4 లక్షలు తీసుకుంటున్నారట.

  • Loading...

More Telugu News