: బ్యాంకాక్ పేలుళ్ల ఘటనలో ఓ వ్యక్తి అరెస్ట్


బ్యాంకాక్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి థాయ్ పోలీసులు ఈరోజు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా బ్యాంకాక్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానితుడిని అరెస్టు చేసినట్టు బ్యాంకాక్ పోలీసుల అధికారిక మీడియా ప్రతినిధి ప్రవుత్ థవోర్న్ సిరి తెలిపారు. అపార్ట్ మెంట్ లో అతని గదిలో బాంబు పేలుడు పదార్థాల్ని కూడా గుర్తించినట్టు చెప్పారు. రెండు వారాల క్రితం బ్యాంకాక్ లో జరిగిన పేలుడులో 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News