: బీహార్ సీఎం ఎవరికి రాఖీ కట్టారో తెలుసా...?
రక్షాబంధన్ నాడు సాధారణంగా అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు, కొంతమంది స్నేహితులు కూడా రాఖీ కట్టుకుంటుంటారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈసారి సరికొత్తగా ఆలోచించారు. పాట్నాలోని రాజధాని వాటిక ప్రాంతంలో ఉన్న ఓ చెట్టుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకే తాను చెట్టుకు రాఖీ కట్టినట్టు చెప్పారు. ప్రజలు మరిన్ని మొక్కలునాటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకే ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్ ను పచ్చగా మార్చేందుకు ప్రజలంతా కృషి చేయాలని కోరారు.