: కేసీఆర్ మద్యం విధానానికి మేము వ్యతిరేకం: మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న చీప్ లిక్కర్ పాలసీని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందని... అలాంటి ప్రాజెక్టు డిజైన్ మారుస్తామని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా, కొన్ని పైప్ లైన్ల కంపెనీలు, కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్ పనులను చేపట్టారని ఆరోపించారు. మెట్రోలైన్ పనులు పూర్తికాకపోవడానికి కూడా కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు.