: దేశ ఐక్యతకు రక్షాబంధన్ నిదర్శనం: వెంకయ్యనాయుడు
బీమా పథకాలను సంక్షేమం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకల్లో వెంకయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనదని, కుల, మత, ప్రాంత, భేదాలు లేకుండా కలసిమెలసి ఉండాలని కోరారు. దేశ ఐక్యతకు రక్షాబంధన్ నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసమే సురక్షా బీమా పథకాన్ని తేవడం జరిగిందని, సెప్టెంబర్ 17న మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు మహిళలు రాఖీలు కడతారని కిషన్ రెడ్డి తెలిపారు.