: వైవీ సుబ్బారెడ్డి, బాలినేని అరెస్ట్
వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా చేపట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా వీరి ఆధ్వర్యంలో ఒంగోలులో కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో, ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ ను వ్యతిరేకించిన వైకాపా కార్యకర్తలు నిరసనగా ఆందోళన చేపట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.