: మహిళలకు నారా లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు
రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మహిళలకు టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అక్కా చెల్లెళ్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఇదే సమయంలో వైసీపీ చేస్తున్న బంద్ పై స్పందిస్తూ, ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన ఉనికి చాటుకునేందుకు పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్నచోట గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.