: ఏ వాహన జీవితకాలం ఎంత? 'ఎండ్ ఆఫ్ లైఫ్' లెక్కలు కడుతున్న కేంద్రం!


భారతావనిలో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో కాలం చెల్లిన వాహనాలు తిరగడం కూడా ఉండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం వాహనాల జీవితకాలం ఎంతన్న విషయాన్ని లెక్కగట్టాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. పాసింజర్ కార్లు, ద్వి, త్రిచక్ర వాహనాలు ఎంతకాలం వాడచ్చన్న విషయాన్ని సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ లో నోటిఫై చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించనున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో వాహనం వయసును బట్టి కాకుండా, ఫిట్ నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన కూడా కేంద్రం వద్ద ఉంది. భారీ పరిశ్రమల శాఖ సైతం కొత్త నిబంధనలు, వాహనాల 'ఎండ్ ఆఫ్ లైఫ్' లెక్కింపునకు సహకరిస్తోంది. జీవితకాలం పదేళ్లు దాటిన వాహనాల్లో 7 శాతం మాత్రమే ప్రమాదకర కాలుష్యాలను అధికంగా వెదజల్లుతున్నాయని, మొత్తం వాయు కాలుష్యంలో ఇది కేవలం ఒక్క శాతమేనని వివిధ నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇక రవాణా రంగంలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలను నిషేధించాలన్న సిఫార్సులకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News