: ఆ సినిమాను పాకిస్థాన్ నిషేధిస్తే...యూఏఈ ఆదరించింది


కబీర్ ఖాన్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'ఫాంటమ్' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను పాకిస్థాన్ నిషేధించడంతో పాకిస్థాన్ మిత్ర దేశాలు కూడా విడుదలకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చివరి క్షణాల్లో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చారు. దీంతో అన్ని థియేటర్లతో పాటు యూఏఈలోని 62 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ముంబై దాడుల ప్రధానంగా రూపొందిన ఈ సినిమా యూఏఈలో తొలిరోజే 1.19 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. 'భజరంగీ భాయ్ జాన్' తరువాత కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా, సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన 'ఏజెంట్ వినోద్', 'ఫాంటమ్' సినిమాలను పాకిస్థాన్ నిషేధించింది.

  • Loading...

More Telugu News