: కాంగ్రెస్ మహిళా నేత మేక కోసం పరుగులు పెడుతున్న యూపీ పోలీసులు


ఉత్తరప్రదేశ్ పోలీసులకు నిత్యం వినూత్న బాధ్యతలు మీద పడుతుంటాయి. మొన్నటికి మొన్న ఆ రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ బర్రెలు పోతే, క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు గంటల్లో వాటిని వెతికిపట్టుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ రాష్ట్ర మహిళా నేత నసీఫా షహీన్ కు చెందిన ఓ మేక తప్పిపోయింది. రాష్ట్రంలోని అలీగఢ్ లో నివాసముండే షహీన్ కు చెందిన మేకను ఎవరో చోరీ చేశారు. అది కనిపించకపోవడంతో కంగారుపడ్డ షహీన్ వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలీగఢ్ ఏసీపీ బ్రజేశ్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందం క్షణాల్లో రంగంలోకి దిగిపోయింది. ఎలాగైనా దొంగలను పట్టుకుని మేకను షహీన్ కు అప్పిగిస్తామని బ్రజేశ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News