: చంద్రబాబూ.. మీ సవాల్ కు నేను సిద్ధం: ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ
రాష్ట్ర సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న విసిరిన సవాల్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించిన ఉండవల్లి, చర్చలో తనకూ అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన కొద్దసేపటి క్రితం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉండవల్లి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు నిన్న విపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.