: తలసాని భూకబ్జాను ఆపాలని కేసీఆర్ కు లేఖ రాశా: మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న జెక్ కాలనీలో వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిని కబ్జా చేసుకోమని కొందరు కాలనీ వాసులకు తలసాని సూచించారని ఆయన ఆరోపించారు. మంత్రిగా ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ కూడా రాశానని తెలిపారు. తలసాని చర్యలకు కేసీఆరే బాధ్యత వహించాలని... వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తలసాని సూచనల మేరకు భూకబ్జా జరిగితే హిందూ, ముస్లింల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.