: ఆత్మహత్యలు వద్దు... రేపటి బంద్ కు సహకరించండి: జగన్ పిలుపు
ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకుందామని ప్రకటించిన ఆయన, రేపు తాము పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. నేటి ఉదయం నెల్లూరు వచ్చిన జగన్, ప్రత్యేక హోదా కోసం నిన్న ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి బంద్ ను అడ్డుకుంటే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు.