: మరో బలిదానం... నిన్న హోదా కోసం ధర్నా చేసిన లోకేష్ గుండె, నేడు మనస్తాపంతో ఆగింది!
ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదన్న మనస్తాపంతో మరో గుండె ఆగింది. కర్నూలుకు చెందిన లోకేష్ అనే వ్యక్తి, హోదా సాధన కోసం నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కార్యకర్తలతో కలసి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాడు. హోదాపై మిత్రులతో చర్చించాడు. ప్రత్యేక హోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడే నష్టాలపై మాట్లాడాడు. హోదా రాదేమోనన్న మనస్తాపంతో, ఆందోళనకు గురైన లోకేష్ కు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే, మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు. లోకేష్ మృతితోనైనా రాజకీయ పక్షాలు కన్ను తెరచి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ప్రత్యక హోదా సాధన సమాఖ్య విజ్ఞప్తి చేసింది. లోకేష్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.