: పోలీసులకు 'సూదిగాడి' మరో సవాల్!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజక్షన్ ఇచ్చి పారిపోతున్న 'సూదిగాడు' ఈ ఉదయం మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురంలో రోడ్డుపై ఉన్న పదేళ్ల బాలికకు ఇంజక్షన్ గుచ్చి పారిపోయాడు. ప్రస్తుతం ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చి పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో ఇంజక్షన్ సైకో బారినపడ్డవారి సంఖ్య 12కు పెరిగింది. కేసు తీవ్రత అధికంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 200కు పైగా బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ సోదాలు జరుపుతున్నారు. నల్లని రంగులో ఉన్న పల్సర్, షైన్ బైకులు కనిపిస్తే వారిని పూర్తిగా తనిఖీలు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నాకనే విడిచిపెడుతున్నారు. కాగా, బాధితులు చెప్పిన వివరాలతో అనుమానితుడి ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు దాన్ని విడుదల చేశారు.