: సిరీస్ ఎవరిదో?... మూడో టెస్టులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక


శ్రీలంక, భారత్ ల మధ్య చివరిదైన మూడో టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య లంక జట్టు తొలుత బ్యాటింగ్ కు రావాలని టీమిండియాను ఆహ్వానించింది. ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టులలో చెరో టెస్టు గెలిచిన ఇరు జట్లు సమఉజ్జీలుగానే ఉన్నాయి. ఈ టెస్టులో నెగ్గిన జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు తమ తమ వ్యూహాలకు పదును పెట్టాయి.

  • Loading...

More Telugu News