: ఎన్నారైలకు మోదీని కలిసే 'లక్కీ' చాన్స్!


వచ్చే నెలలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పర్యటించనున్న భారత ప్రధాని మోదీని కలవాలని భావించే వారి కోసం రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. ఏ కంపెనీతోను సంబంధం లేకుండా ఉండే వ్యక్తులు మోదీని కలవాలని భావిస్తే ఈనెల 31లోగా రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు వివరించారు. సెప్టెంబర్ 27వ తేదీన శాన్ జోస్ లోని ఎస్ఏపీ సెంటర్ లో జరిగే రిసెప్షన్ కు వీరు హాజరు కావచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే, 'www.pmmodiinca.org'లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మోదీని కలవలేరు సుమా. కేవలం 18 వేల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్న మొదలు కాగా, ఇప్పటికే 40 వేల మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆగస్టు 31 తరువాత కంప్యూటర్ ద్వారా 18 వేల మందిని ఎంపిక చేసి వారిని ఆహ్వానిస్తారు.

  • Loading...

More Telugu News