: తెలంగాణ దారిలోకి ఏపీ... చీప్ లిక్కర్ వచ్చేస్తోంది!
పొరుగున ఉన్న తెలంగాణలో చీప్ లిక్కర్ అమ్మకాలు ప్రారంభిస్తే, సరిహద్దు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, తద్వారా ఎక్సైజ్ ఆదాయానికి గండి పడుతుందని భయపడుతున్న ఏపీ సర్కారు, నష్ట నివారణకు తెలంగాణ దారిలోనే నడవనుంది. సరిహద్దు జిల్లాల్లో చౌక ధరలకే మద్యం లభించేలా చూడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అమ్మే చీప్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా చూడాలని భావిస్తూ, మద్యం కోసం ప్రజలు తెలంగాణలోకి వెళ్లకుండా చూడాలన్న కృతనిశ్చయంతో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో క్వార్టర్ రూ. 30కి లభించేలా చీప్ లిక్కర్ అమ్మకాలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.