: ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధమే!: విపక్షాలకు చంద్రబాబు సవాల్


ప్రత్యేక హోదాను తీసుకుంటే నిధులు రావని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. భూ సమీకరణ, సేకరణ, హోదా తదితర అంశాలపై తాను చర్చకు సిద్ధమని విపక్షాలకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇస్తామన్న వైకాపా నేత జగన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపాకు రాజకీయాలు చేయడమే విధి అని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. హోదాను మించిన లాభాలను రాష్ట్రానికి తీసుకువచ్చి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం నుంచి కృష్ణానదికి నీరు వెళ్లకుంటే, రాయలసీమ ఎడారిగానే మిగులుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు చేసే భావోద్వేగ ప్రకటనలను నమ్మి యువత ఆవేశపడొద్దని చంద్రబాబు హితవు పలికారు. భూములు ఇచ్చేస్తామని అనడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమేనని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే చూస్తూ ఊరుకునేవాడిని కాదని అన్నారు. వారం రోజుల్లో పట్టిసీమ అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఏ అంశంపైనైనా చర్చిద్దామంటే తాను సిద్ధమేనని తెలియజేశారు.

  • Loading...

More Telugu News