: షీనా బోరా హత్యకేసులో మరో కొత్త కోణం
షీనా బోరా హత్య కేసులో గంటకంటకూ ఓ ట్విస్టు బయటపడుతోంది. షీనా బోరా హత్యకు కారణం స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియాతో సంబంధమే కారణమా? అంటే కాదని చెబుతున్నాడు ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖాయిల్ బోరా. తన సోదరి హత్య కేసులో పలు అంశాలున్నాయని మిఖాయిల్ బోరా తెలిపారు. తన సోదరి షీనా బోరా, పీటర్ ముఖర్జియా కలిసి ఉన్న కొన్ని ఫోటోలతో పాటు, కొన్ని సంభాషణలు కూడా తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడు. కాగా, కుమార్తె షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియాకు తన చెల్లెలుగా పరిచయం చేసింది. అంటే పీటర్ ముఖర్జియాకు షీనా బోరా మరదలు వరసవుతుందని ఆయన భావించి ఉండాలి. అలాగే తన సోదరి పేరిట ఉన్న ఆస్తిపాస్తులు కూడా ఈ హత్యకు కారణమై ఉంటాయని మిఖాయిల్ బోరా చెబుతున్నాడు. ఏమైనా, ఆమె హత్యకు అసలు కారణం పోలీసుల విచారణలోనే తేలాలి!