: సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు చాన్స్


భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శుక్రవారం ఆరంభం కానుంది. రెండో టెస్టు అనంతరం దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అతడి స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి ఎంపిక చేశారు. కెరీర్లో ఇప్పటిదాకా 20 టెస్టులాడిన తరంగ 31.80 సగటుతో 1113 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చివరి టెస్టుకు జట్టు ఎంపిక విషయమై లంక సారథి ఏంజెలో మాథ్యూస్ మాట్లాడుతూ... మార్పులు చేర్పుల విషయమై ఆలోచిస్తున్నామని తెలిపాడు. జెహాన్ ముబారక్ స్థానంలో హార్డ్ హిట్టర్ కుశాల్ పెరీరాకు టెస్టు అరంగేట్రం అవకాశమివ్వడంపై చర్చిస్తున్నామని చెప్పాడు. ఇక, ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ రేపటి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. దాంతో, రెండో స్పిన్నర్ గా దిల్ రువాన్ పెరీరాకు చాన్స్ లభించవచ్చు.

  • Loading...

More Telugu News