: షీనా బోరా సోదరుడు మిఖాయిల్ అరెస్టు


ధ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న షీనా బోరా హత్యకేసులో మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షీనా బోరా సోదరుడు, ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖాయిల్ బొరాను దిస్ పూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షీనా బోరాను తన తల్లే హత్య చేసిందని, తనను కూడా హత్య చేసేందుకు చూసిందని మిఖాయిల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తనతల్లి నిజాలు ఒప్పుకుంటే మంచిదని, లేని పక్షంలో తానే కొన్ని సాక్ష్యాధారాలు పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కోవడంతో మిఖాయిల్ పై పోలీసులు దృష్టి పెట్టారు. మిఖాయిల్ ను విచారిస్తే షీనా బోరా హత్యకేసులో కొత్త అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని భావించిన పోలీసులు, అతనిని దిస్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. మిఖాయిల్ విచారణలో ఏ అంశాలు వెలుగు చూస్తాయో తెలియాలంటే మరికొంత కాలం ఆగాలి.

  • Loading...

More Telugu News