: విడాకుల పుకార్లను కొట్టిపారేసిన జాన్ అబ్రహామ్


వైవాహిక జీవితంలో కలతలు రేగడంతో భార్య ప్రియా రుంచాల్ తో విడాకులకు సిద్ధమైనట్టు వస్తున్న ఊహాగానాలపై బాలీవుడ్ అందగాడు జాన్ అబ్రహాం స్పందించాడు. తాను విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవాలని కొట్టిపారేశాడు. తన దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోందని స్పష్టం చేశాడు. అలాంటివి విన్నప్పుడు అసహ్యం కలుగుతుందని అన్నాడు. వ్యక్తిగత జీవితంపై తన మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం పట్ల అసహనానికి గురైనట్టు తెలిపాడు. కొన్నిసార్లు ఇతరులకు మన గురించి చెప్పుకోవాల్సి రావడం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తానో కామెడీ సినిమా చేస్తున్నానని, అయితే, తన జీవితం వెలుపల కామెడీ జరుగుతున్న విషయం తెలియదని చమత్కరించాడు.

  • Loading...

More Telugu News