: భారత్ తో చర్చల రద్దుపై ఐరాసను ఆశ్రయించిన పాక్


భారత్ తో జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశం చివరి నిమిషంలో రద్దు కావడంపై పాకిస్థాన్ తాజాగా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. చర్చలకు ముందు భారత్ షరతులు విధించిందని, ఆ కారణంగానే చర్చలు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఐరాసలో పాక్ శాశ్వత రాయబారి మలీహా లోధీ ఐరాస డిప్యూటీ సెక్రెటరీ జనరల్ జాన్ ఇలియాస్సన్ కు వివరించారు. కాశ్మీరీల (వేర్పాటువాదులు) తో సంప్రదింపులు శాంతియుత పరిష్కారానికి ఎంతో అవసరమని లోధీ పేర్కొన్నారు. హురియత్ నేత అజీజ్ తో సమావేశాన్ని 'ఎన్ఎస్ఏ' అజెండాలో చేర్చినందునే భారత్ విభేదించిందని ఇలియాస్సన్ కు తెలిపారు. దాంతో, చర్చలు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అటు, ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ఎన్ఎస్ఏ స్థాయి చర్చల రద్దుపై విచారం వ్యక్తం చేశారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన భారత్, పాక్ దేశాలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News