: ఇండియాలో ఏ మతానికీ చెందని వారూ ఉన్నారట... తొలిసారిగా వెల్లడైన నిజం
ఇండియాలో నివసిస్తూ తాము ఏ మతానికీ చెందిన వారం కాదని వెల్లడించిన వారి సంఖ్య 28.7 లక్షలు. జనాభా గణన వివరాలు వెల్లడికాగా, ఈ తరహా మతం పేరు చెప్పని వారి సంఖ్య వివరాలు భారత చరిత్రలో తొలిసారిగా విడుదలయ్యాయి. మొత్తం 121 కోట్ల మంది జనాభాలో 0.24 శాతం మంది తమకు మతాలపై నమ్మకాలు లేవని వెల్లడించారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో వీరి సంఖ్య అధికంగా ఉంది. మొత్తం 14,63,712 మంది పురుషులు, 14,03,591 మంది మహిళలు తమకు ఏ మతమూ లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 5.82 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో 4.04 లక్షల మంది, మహారాష్ట్రలో 2.86 లక్షల మంది, బీహార్ లో 2.82 లక్షల మంది, పశ్చిమ బెంగాల్ లో 2.28 లక్షల మంది, తమిళనాడులో 1.88 లక్షల మంది, కర్ణాటకలో 1.66 లక్షల మంది మత విశ్వాసాలకు దూరంగా ఉన్నట్టు తెలిపారు.