: హరీష్ రావు నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందుతున్నా: నారా లోకేష్
నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. తమకు వైరిపక్షమైన టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే తనకు స్ఫూర్తి అని టీడీపీ యువనేత, కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ నారా లోకేష్ స్పష్టం చేశారు. 'హరీష్ రావు ఒక నిజమైన మాస్ లీడర్' అంటూ లోకేష్ కితాబిచ్చారు. నిత్యం జనాల్లో తిరుగుతూ, వారితో మమేకమై ఉండే హరీష్ విధానం తనకు ఎంతో నచ్చుతుందని చెప్పారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ కు, టీడీపీకి ఎప్పుడూ సరిపడదు. ఉప్పు, నిప్పు సామెతకు ఉదాహరణ ఈ రెండు పార్టీలు. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ కు హరీష్ రావు పట్ల మంచి అభిప్రాయం ఉండటం ఆసక్తికర అంశమే!