: మళ్లీ ‘టాప్’లోకొచ్చిన ముఖేశ్ అంబానీ... భారత కుబేరుల్లో అగ్రస్థానం కైవసం


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ సత్తా చాటారు. నిన్నటిదాకా భారత సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీని రెండో స్థానంలోకి నెట్టేసిన ధీరూభాయి అంబానీ పెద్ద కుమారుడు టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం వరకూ టాప్ పొజిషన్ ముఖేశ్ అంబానీదే. అయితే మార్కెట్ లో సన్ ఫార్మా షేర్లు వెలిగిపోవడంతో ఒక్కసారిగా దిలీప్ సంఘ్వీ అగ్రస్ధానానికి దూసుకొచ్చారు. కేవలం కొన్ని నెలల పాటే సంఘ్వీ ఆ స్థానంలో ఉండగలిగారు. తాజాగా బ్లూంబర్గ్ వెల్లడించిన డేటా ప్రకారం 18.2 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ టాప్ ప్లేస్ చేజిక్కించుకోగా, రెండో స్థానానికి పడిపోయిన సంఘ్వీకి 17.8 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇదిలా ఉంటే మొన్నటిదాకా టాప్ టెన్ రిచెస్ట్ ఇండియన్లలో ఒకరిగా ఉన్న ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తాజాగా ఆ జాబితాలో చోటు కోల్పోయారు.

  • Loading...

More Telugu News