: జగన్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు: డిప్యూటీ సీఎం కేఈ


రాజధాని భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయడంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. అసలు జగన్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికే రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని, ఇంకా భూ సేకరణ అవసరం లేదని అనుకుంటున్నట్టు తెలిపారు. రాజధాని భూ సేకరణ వ్యవహారం ప్రత్యేక కమిటీ చూసుకుంటుందని చెప్పారు. రాయలసీమకు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ కావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ తమకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని తెలిపారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనపై త్వరలో నివేదిక వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News