: కేసీఆర్ ముఖ్యమంత్రే కావచ్చు... కానీ, తెలంగాణ అతని జాగీరు కాదు: పొన్నం


రాష్ట్రాన్ని ఇష్టానుసారం పాలించాలని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నింటినీ రీడిజైన్ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని... ఇదేమైనా ఆయన సొంత సామ్రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసే అంశంపై విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని కేసీఆర్ మండిపడటాన్ని పొన్నం తప్పుపట్టారు. ఇష్టానుసారం డిజైన్లు మారిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని... తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News