: సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీబీఐ కోర్టు అరెస్ట్ వారెంట్
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీబీఐ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎమ్మార్ కేసులో 11వ నిందితుడుగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ కేసు విచారణకు సంబంధించి చాలాకాలంగా కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు కొద్దిసేపటి క్రితం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక హోదాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఆయన పనిచేస్తున్నారు.