: శాంతి చర్చల కోసం వెళితే విషమిచ్చి చంపిన పాక్!
శాంతి చర్చల కోసం వెళ్లిన తాలిబన్ కమాండర్లను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన భద్రతా దళాలు విషమిచ్చి చంపాయని పాకిస్థానీ తాలిబన్ వర్గాలు విమర్శించాయి. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తెహ్రీక్ ఈ తాలిబన్ (టీటీపీ), 2009 లో ఐదుగురు సభ్యులు శాంతి చర్చల నిమిత్తం పెషావర్ వెళ్లగా వారిని అరెస్ట్ చేశారని, వీరిని వివిధ జైళ్లలో ఉంచి హింసించారని, మంగళవారం నాడు విషమిచ్చి చంపారని ఆరోపించింది. 2007 నుంచి 2009 వరకూ స్వాత్ లోయలో కఠిన షరియా చట్టాలను, బహిరంగ మరణశిక్షలను అమలు చేయించిన ముస్లిం ఖాన్, మహబూబ్ ఖాన్ లు వీరిలో ఉన్నారని తెలిపిన టీటీపీ మిగతా వారి వివరాలు తెలియజేయలేదు.