: తూటాల్లా పేలుతున్న హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు...సుప్రీంకోర్టునూ ప్రశ్నించిన యువ సంచలనం


గుజరాత్ లో పటేళ్ల ఆందోళన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న అహ్మదాబాదు, సూరత్ లలో పెచ్చరిల్లిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఘటనలో ఇంకో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 22 ఏళ్ల వయస్సున్న హార్దిక్ పటేల్ ఉద్రేకపూరిత ప్రసంగాలతో పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తోంది. నిన్నటి ఆందోళన సందర్భంగా అతడి మాటలు తూటాల్లా పేలాయనే చెప్పాలి. ‘‘ఓ ఉగ్రవాది కోసం అర్ధరాత్రి తెరచుకున్న సుప్రీంకోర్టు తలుపులు... దేశం కోసం, దేశానికి వెన్నెముకలా నిలుస్తున్న యువత కోసం తెరచుకోవా?’’ అన్న హార్దిక్ ఆవేదన అతడి సామాజిక వర్గానికి చెందిన యువతను మరింత ఉద్రేకానికి గురి చేసింది. ఈ క్రమంలోనే అక్కడ పటేళ్ల పోరుబాట ఉగ్రరూపం దాల్చిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News