: ‘అనంత’ రోడ్డు ప్రమాదం బారిన హిందూపూర్ వాసులు... వేగంగా స్పందించిన బాలయ్య
అనంతపురం జిల్లాలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హిందూపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల వెంకన్నను దర్శించుకుని వస్తున్న వీరి వాహనం అనంతపురం జిల్లాలోని దేవిరెడ్డిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ వేగంగా స్పందించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన బాలయ్య, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో ఆదేశాలు జారీ చేశారు.