: ఈ ‘బ్రా’ ముట్టుకుంటే భారీ షాక్ ఖాయం...మహిళలకు ‘రక్షణ కవచం’ రూపొందించిన చెన్నై యువతి


దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కఠిన శిక్షలు, ప్రత్యేక పోలీసు విభాగాలు మృగాళ్లను నిలువరించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణే మెరుగైన ఫలితాలిస్తుందన్న భావనతో చెన్నైకి చెందిన యువతి మనీషా మోహన్ ఓ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమెరికాలోని మిట్ మీడియా ల్యాబ్ లో చదువుతున్న మనీషా, మహిళలకు ‘రక్షణ కవచం’గా ఓ ‘బ్రా‘ను రూపొందించారు. ఈ బ్రాను తాకిన వారికి ఏకంగా 3,800 కిలో వాట్ల విద్యుత్ షాక్ కొడుతుందట. అంతేకాక, అందులో అమర్చిన జీపీఎస్ పరికరం సమీపంలోని పోలీస్ స్టేషన్ కు క్షణాల్లో సందేశాన్ని పంపుతుంది. తాను రూపొందించిన ఈ వినూత్న బ్రాను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చూపి ఆయన చేత ప్రశంసలందుకున్నారు. సుదూర ప్రాంతాల్లో విద్యనభ్యసించాల్సి రావడమే ఈ వినూత్న ఆవిష్కరణకు నాంది పలికిందని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News