: జగన్ పార్టీ చేసేవన్నీ పెయిడ్ ఆందోళనలే!: సినీ నటుడు శివాజీ


ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న సినీ నటుడు శివాజీ వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ కు దమ్ముంటే ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని నిలదీయాలని అన్నారు. వైసీపీ అధినేత తన స్వార్థం కోసం ప్రజలను బలిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు. జగన్ పార్టీ చేసేవన్నీ పెయిడ్ ఆందోళనలే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, వారి పోరు నడుమ ఆంధ్రప్రదేశ్ నలిగిపోతోందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News