: సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ రక్షాబంధన్ కానుక
సిరిసిల్ల చేనేత కార్మికులకు తెలంగాణ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రక్షాబంధన్ కానుక ఇచ్చారు. సిరిసిల్లలో చేనేత, పవర్ లూమ్ కార్మికులకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. సురక్ష బీమా యోజన ద్వారా 2 లక్షల రూపాయల బీమా పధకం అందరికీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పారు. రక్షా బంధన్ నాటికి 25 వేల మంది కార్మికులకు జీవిత బీమా అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో, రక్షా బంధన్ నాటికి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 25 వేల మంది చేనేత, పవర్ లూం కార్మికులు బీమా లబ్ధిదారులు కానున్నారు.