: వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా?...అయితే, ఇలా చేయండి!


బరువు తగ్గాలని ఉందా? కానీ వ్యాయామం చేయడం ఇబ్బందిగా ఉందా? అయితే పరిష్కారం ఇదిగో... 12 వారాల పాటు మూడు పూటలా భోజనం చేసే ముందు అరలీటరు నీళ్లు తాగితే కచ్చితంగా నాలుగు కేజీల బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. లండన్ లోని ఒక యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 12 వారాలపాటు జరిపిన పరిశోధనలో ఈ విషయం గుర్తించినట్టు తెలిపారు. స్థూలకాయంతో బాధపడుతున్న స్త్రీ, పురుషులపై వీరు పరిశోధనలు నిర్వహించారు. 12 వారాలపాటు వారికి భోజనానికి ముందు మంచి నీళ్లిచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. దీంతో వారిలో కొందరు 1.3 కేజీల బరువు తగ్గారని, మూడు పూటలా భోజనం ముందు 500 మిల్లీ లీటర్ల మంచి నీరు తీసుకున్న వాళ్లు నాలుగు కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. బరువెక్కువైందని భావించే వారు వ్యాయామం, శారీరక శ్రమ, అలసట లేకుండా నీళ్లు తాగేసి బరువు తగ్గించుకోవచ్చంటే, అంతకు మించిన సలహా ఇంకేముంటుంది?...అందుకే, ఇకపై నీళ్లు తాగి నాజూగ్గా తయారవ్వండి!

  • Loading...

More Telugu News