: నేడూ మార్కెట్ పతనమే... అయినా లాభాల పంట పండించుకున్న బుల్లి కంపెనీలు!


స్టాక్ మార్కెట్లో మంగళవారం నాడు కనిపించిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నిలవలేదు. భారీ పతనం తరువాత ఆర్థికమంత్రి జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ లు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచేలా చేసిన వ్యాఖ్యల ప్రభావం ఒక్కరోజుకే పరిమితమైంది. బుధవారం నాడు మరోసారి మార్కెట్ నష్టపోయింది. ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచి 317.72 పాయింట్లు పడిపోయి 1.22 శాతం నష్టంతో 25,714.66 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 88.85 పాయింట్లు నష్టపోయి 1.13 శాతం పతనంతో 7,791.85 పాయింట్లకు చేరాయి. ఇదిలావుండగా, లార్జ్ కాప్ కంపెనీలు నష్టాల్లో అల్లాడుతుంటే, బీఎస్ఈ స్మాల్ కాప్ లాభాల్లో నడిచింది. ఇన్వెస్టర్ల దృష్టి అంతగా పడని ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలు లాభాలను పండించుకున్నాయి. ఐఎఫ్జీఎల్ రెఫ్ రాక్ 13.35 శాతం, సన్ డుమా 13.14 శాతం, కేశోరామ్ ఇండస్ట్రీస్ 10.48 శాతం, యూబీ హోల్డింగ్స్ 10.37 శాతం, నీల్ కమల్ 10 శాతం పెరిగాయి. వీటితో పాటు పీ ఫోకస్, వక్రంగీ, రెయిన్ బో పేపర్, బీఎస్ఎల్ లిమిటెడ్, జేకే పేపర్, లావోపాలా, ఐనాక్స్ లీజర్, ఉషా మార్ట్, హెర్క్యులస్, కేఈసీ, జాక్సన్ తదితర కంపెనీల ఈక్విటీ విలువ 7 నుంచి 10 శాతం వరకూ పెరిగింది. బీఎస్ఈ స్మాల్ కాప్ 0.16 శాతం పెరిగింది. మిడ్ కాప్ 0.79 శాతం నష్టపోయింది.

  • Loading...

More Telugu News