: తమిళనాట మరో పథకంతో కరుణ కురిపించిన 'అమ్మ'
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో పథకాన్ని ప్రకటించారు. అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకం కింద రక్త, మూత్ర పరీక్షలు, మధుమేహం, థైరాయిడ్ పరీక్షలు, కొలెస్ట్రాల్, లివర్ స్క్రీనింగ్, చెస్ట్ ఎక్స్ రే, ఎకో కార్డియోగ్రఫీ టెస్టు, యూఎస్జీ అబ్డామిన్ పరీక్ష... తదితరాలు మహిళలకు అందబాటులోకి వస్తాయి. ఈ మేరకు జయ సభలో ప్రకటన చేశారు. మాస్టర్ చెకప్ కు ప్రైవేటు ఆసుపత్రులు రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నాయని, ఆ భారం భరించలేని వారికి వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకే తాజా పథకం ప్రకటించామని వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకాన్ని తొలుత చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టనున్నారు.