: శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం
కలియుగ వెంకటేశ్వరుడి వార్షిక వసంతోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేశారు. స్వామికి అభిషేకం, ఇతర సేవలు జరుగుతున్నాయి. అనంతరం ఉత్సవ మూర్తులు ఆలయానికి చేరుకుంటారు. రేపు ఉదయం 8 గంటలకు బంగారు రథంపై స్వామి తిరువీధులలో భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం వసంత మండపంలో స్వామికి వసంతోత్సవం నిర్వహిస్తారు. 25న ఉత్సవాలు ముగుస్తాయి. సాలకట్ల వసంతోత్సవాలను టిటిడి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన వారికి మూడు గంటలలో దర్శనం పూర్తవుతోంది. 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.