: పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఒడిశా తీరం, ఉత్తర కోస్తాలను ఆనుకుని కేంద్రీకృతమై ఉన్నట్టు ప్రకటనలో వివరించారు. రానున్న రోజుల్లో ఇది బలపడుతుందని, తద్వారా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా, తెలంగాణ జిల్లాల్లో గాలుల తీవ్రత హెచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షపాతాలు నమోదయ్యాయి.