: తెలంగాణ మద్యం పాలసీ ఇదే!


తెలంగాణ మద్యం విధానం ఖరారైంది. ఈ మేరకు కేసీఆర్ సర్కారు కొత్త ఏడాదికి మద్యం విధానాన్ని వెలువరించింది. ఇందులో భాగంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మద్యం దుకాణాలను కేటాయించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కొత్త మద్యం విధానంలో బార్ల లైసెన్స్ పాలసీని ఖరారు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి 13 వేల మంది జనాభాకు ఒక బార్ ను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఓ ప్రాంతంలో 13 నుంచి 26 వేల మంది ఉంటే రెండు బార్లకు అనుమతిస్తామని పేర్కొంది. త్రీస్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. మునిసిపాలిటీల్లో 30 వేల జనాభాకు ఒక బార్, అంతకు మించితే 60 వేల మంది వరకూ రెండు బార్లకు అనుమతిస్తామని వెల్లడించింది. జనాభా సంఖ్య అంతకుమించితే ప్రతి 30 వేల మందికి అదనపు బార్ కు అనుమతిస్తామని పేర్కొంది. బార్లకు అనుమతులను డ్రా విధానంలో ఇవ్వనున్నట్టు తెలిపింది. తెలంగాణ మద్యం విధానంపై మరిన్ని వివరాలు వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News